Breaking News

మొల్ల జయంతి వేడుకలు సందర్భంగా ఘన నివాళి

-జెసి చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం కలక్టరేట్ లో తొలి తెలుగు కవితా రచయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు … కవయిత్రి మొల్ల చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రామాయణాన్ని రచించడం జరిగిందన్నారు. ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందన్నారు. మొల్ల రామాయణం ఆరు కాండాలలో 871 పద్యాలతో రచించడం జరిగిందనీ, ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి గా పేర్కొన్నారు.మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా తెలుగులో వ్రాయబడిన అనేక రామాయణాలలో మొల్ల రామాయణం చాలా సరళమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఆర్ వో టి సీతారామ మూర్తి, జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక, కలక్టరేట్, ఇతర శాఖల అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *