-నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పేపర్ – I, కామర్స్ పేపర్ – I, సోషియాలజీ పేపర్ – I, ఫైన్ ఆర్ట్స్ , మ్యూజిక్ పేపర్ – I మరియు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 32,187 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 32,187 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 12 ఒకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కెమిస్ట్రీ పేపర్ – I, కామర్స్ పేపర్ – I, సోషియాలజీ పేపర్ – I, ఫైన్ ఆర్ట్స్ , మ్యూజిక్ పేపర్ – I మరియు ఒకేషనల్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు జనరల్ 31,898 మంది, ఒకేషనల్లో 1,190 మంది మొత్తం 33,088 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా జనరల్లో 780 , ఒకేషనల్లో 121 మంది, మొత్తం 901 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో త్రాగు నీటి వసతి, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించామని ఆర్.ఐ. ఓ ఆ ప్రకటనలో తెలిపారు.