-ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం
-డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు
-విజయవాడ నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు సమాలోచనలు
-పారిశ్రామిక వేత్తలకు సతీష్ రెడ్డి పలు సలహాలు సూచనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని ప్రాంతమైన విజయవాడ ప్రాంతంలో డిఫెన్స్ ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు రానున్నాయి. ఇంకా ఈ ప్రాంత పారిశ్రామికాభివృద్ది కి ఎలాంటి వ్యూహాం అనుసరించాలి. ఎటువంటి పరిశ్రమల ఏర్పాటుతో త్వరగా పారిశ్రామికాభివృద్ది జరుగుతుందనే అంశంపై త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటి,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి చర్చించనట్లు విజయవాడ ఎంపి కేశినేని శినవాథ్ (చిన్ని) తెలిపారు.
రాబోయే కాలంలో విజయవాడ నగర ప్రాంతం పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశంపై డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి తో ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తన కార్యాలయంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్ఫగుచ్చంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించారు.
సతీష్ రెడ్డి ఈ సమావేశంలో పారిశ్రామిక వేత్తలకు రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీలు అభివృద్ది చెందాల్సిన అవసరం , ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి చెప్పటంతోపాటు పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఎంపి కేశినేని శివనాథ్ చేస్తున్న కృషిని వివరించారు. అలాగే పారిశ్రామిక వేత్తలు అడిగిన సందేహాలకు సతీష్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
ఈ సమావేశం అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి మీడియా తో మాట్లాడారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి విజయవాడ రావటం, నగర పారిశ్రామిక వేత్తలను కలవటం చాలా సంతోషంగా వుందన్నారు. ఇది విజయవాడ పారిశ్రామిక రంగానికి చాలా ఆనందకరమైన రోజు అని ప్రకటించారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ది సాధించాలనే అంశంతో పాటు, డిఫెన్స్ రంగంలో ఎన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి..ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించుకోవటం జరిగిందన్నారు. ఇలాంటి సమావేశాలు మరిన్నీ జరగాల్సిన అవసరం వుందని సతీష్ రెడ్డి అభిప్రాయపడినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో నగర పారిశ్రామికాభివృద్దికి సంబంధించి పారిశ్రామికవేత్తలకు నిత్యం అందుబాటులో వుంటానని , వారికి కావాల్సిన సలహాలు సూచనలు అందిస్తానని సతీష్ రెడ్డి చెప్పటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధిలో తామందరం కలిసికట్టుగా సతీష్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళతామన్నారు. అలాగే ఎఫ్ట్రానిక్స్ సి.ఈ.వో రామకృష్ణ సూచనల ప్రకారం నేటి కాలానికి అనుగుణంగా పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేయాల్సిన మార్పులు, అదనంగా చేర్చాల్సిన కోర్సుల అంశంపై తామందరం మంత్రి నారాలోకేష్ ను కలిసి చర్చిస్తామన్నారు. పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు యూనివర్శిటీలో వుండే విధంగా కృషి చేస్తామన్నారు. ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యుల తరుఫున సతీష్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.
డి.ఆర్.డి.వో మాజీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రతి నగరంలో ముఖ్యంగా రాజధాని నగరంలో ఇండస్ట్రీలు, స్టార్టప్ లు చాలా ప్రముఖంగా దేశంలో వస్తున్నాయన్నారు. కేంద్రప్రభుత్వం డిఫెన్స్, ఎరోస్పెస్, కమ్యూనికేషన్, రైల్వే రంగాల్లో స్వదేశీయంగా ఉత్పత్తులు తయారు చేయించి వాటినే వాడాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని తెలిపారు. అందుకే ఆయా మంత్రిత్వ శాఖలో విదేశాల నుంచి ఏ వస్తువులు దిగుమతి చేసుకుంటున్నామో ఒక జాబితా తయారు చేసి వెబ్ సైట్ లో పెడుతున్నట్లు తెలిపారు. దేశంలోని పారిశ్రామికవేత్తలతో వాటిని తయారు చేయించాలనే ఉద్దేశ్యంతో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రకరకాల పథకాలు అమల్లోకి తీసుకువచ్చిందన్నారు.
ఎపి రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీలో అభివృద్ది చెందాల్సిన అవసరం చాలా వుందన్నారు. ముఖ్యంగా విజయవాడ ఈ నగర చుట్టూపక్కల ప్రాంతాలతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రీలు పెరగాల్సిన అవసరం చాలా వుందన్నారు. ఇందుకోసంరాష్ట్ర ప్రభుత్వం తో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ది పై ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తనతో చర్చలు జరపటం జరిగిందన్నారు..ఈ ప్రాంతంలో సాధారణ పరిశ్రమలతో పాటు డిఫెన్స్, ఎరోస్పెస్ ఇండస్ట్రీలను ఎలా అబివృద్ది చేయాలి..ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లాలి.. ఈ పరిశ్రమల స్థాపనకు ప్రాంతం అయితే బాగుంటుందనే అంశంపై సమాలోచనలు ఇద్దరి మధ్య జరిగినట్లు చెప్పారు.
ప్రభుత్వాధికారులతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) స్థలం ఎంపిక గురించి సర్వే చేయటం జరుగుతుందని, ఆ పని మీద తాను విజయవాడ రావటం జరిగిందని తెలిపారు. పారిశ్రామికవేత్తలతో సమావేశం కావటం చాలా ఆనందంగా వుంది..వారు ఏ రకమైన ఆలోచనలతో వున్నారు. వారికి ఎలాంటి మద్దతు కోరుకుంటున్నారో తెలిసిందన్నారు. అలానే పారిశ్రామికవేత్తలు మరికొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాబోయే ఇండస్ట్రీ జోన్ ను ఏ విధంగా అబివృద్ది చేసుకోవాలి అందులో ఎలాంటి సదుపాయాలు కావాలనే అంశాలపై చర్చించుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది సాధించాలంటే ప్రభుత్వంతో కలిసి పారిశ్రామికవేత్తలు పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ ప్రెసిండెంట్ బాయన వెంకట రావు, ప్రెసిడెంట్ దోనేపూడి దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ ఎమ్. రామచంద్రరావు, జె.ఆర్.డి టాటా ఇండస్ట్రీస్ ఎస్టేట్ సోసైటీ చైర్మన్ వినోద్ బాబు, సెక్రటరీ టి.శ్రీనివాసరావు, విజయవాడ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సెక్రటరీ టి.నాగేశ్వరరావు, ఎపి ఛాంబర్ ప్రెసిడెంట్ పి భాస్కర్ రావు, ఎపి చాంబర్ సెక్రటరీ ఎమ్.రాజశేఖర్, పారిశ్రామికవేత్తలు కోనేరు విశ్వ ప్రసాద్, కె.రాజేష్,వి.రమేష్ బాబు, కె.శశికాంత్, జి.శ్రీనివాస్, టి.పార్థసారథి, ఎ.రమేష్ బాబు, బి.వెంకటరావు, జె.ఎస్.ఆర్.కె.ప్రసాద్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.