-కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్లడి
-గిరిజన సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అందజేసే సహాయ నిధి పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో గిరిజన సంక్షేమానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల (VOs)కు అందజేసే ‘సహాయం నిధి’ పథకం కింద 2022-23 నుంచి 2024-25 (07.03.2025) వరకు ఆమోదించబడిన ప్రతిపాదనలు 15 మాత్రమే.ఈ కాలంలో ఎపికి 12 ఎన్జీవోలు, 15 ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్లడించారు. 2022 నుంచి ఇప్పటి వరకు ఎపిలో ‘సహాయం నిధి’ పథకం కింద ఆమోదించిన ప్రతిపాధన సంఖ్య వివరాలు, అలాగే ఎపిలో మంజూరైన ఎన్జీవో సంస్థలు, ప్రాజెక్టుల వివరాలు, వాటికి కేటాయించిన నిధులు, ఈ పథకం కింద నమోదు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య తెలియపర్చాలంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ లోక్ సభలో గురువారం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖను లిఖిత పూర్వకంగా అడగటం జరిగింది. వీటికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ పథకం పరిశీలనకు సంబంధించి అధ్యయనం చేయటానికి కేంద్రప్రభుత్వం భారత్ రూరల్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ (BRLF) అనే స్వతంత్ర సంస్థను నియమించిందని పేర్కొన్నారు. ఈ సంస్థ 2022 డిసెంబర్‌లో పథకం సమగ్ర సమీక్ష నివేదికను సమర్పించటం జరిగిందన్నారు. జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తనిఖీ చేస్తారన్నారు. ఈ పథకాన్ని ఎన్.జి.వో గ్రాంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అమలు చేయబడుతుందన్నారు.