విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ డివిజన్ లోని ప్రజల సమస్యల పరిష్కార సౌకర్యార్థం ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకూ స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుందని విజయవాడ సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వారిచే స్వయంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించ బడును. కృష్ణా జిల్లా కలెక్టర్ వారి సర్కులర్ ఆదేశాల మేరకు స్పందన కార్యక్రమం పునరుద్ధరణలో భాగంగా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున విజయవాడ డివిజన్ లోని ప్రజలందరూ తమ సాధారణ విజ్ఞప్తులను, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న విజ్ఞప్తులను తగు ఆధారాలతో సోమవారం పైన తెలియజేయబడిన సమయం లో స్వయంగా సబ్ కలెక్టర్ వారికి అందచేయవచ్చునని తెలిపారు .ప్రజలు ఈ కార్యాలయానికి వచ్చేటప్పుడు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్క్ లను విధిగా ధరించి రావాలని కోరడమైనది.
Tags vijayawada
Check Also
ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమవారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద …