Breaking News

3 కంప్రెసర్లు మరియు 2 ట్రిప్పర్ల స్వాధీనం

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మండలం దేచెర్ల గ్రామంలోని Sy.no.84 వద్ద మెసర్స్ కే వి ఆర్ స్టోన్ క్రషర్ ద్వారా రోడ్డు మెటల్ అక్రమ తవ్వకంలో పాల్గొన్న 3 కంప్రెసర్లు మరియు 2 ట్రిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా మైన్స్ శాఖ సహాయ సంచాలకులు డి.ఫణి భూషణ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. సీజ్ చేసిన వాహనాలను సేఫ్ కస్టడీ కోసం స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొవ్వూరుకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో సర్వేయర్ శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను కొవ్వూరు పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా పిహెచ్ సిల నిర్మాణాలు

-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం -కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు -గిరిజన ప్రాంతాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *