కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార శాఖలో జరుగుతున్న కంప్యూటరైజే షన్ కార్యక్రమాన్ని పరిశీలించుటకు జిల్లా సహకార అధికారి ఎం జగన్నాథరెడ్డి, డివిజనల్ సహకార అధికారి కొవ్వూరు వి కృష్ణ కాంత్ ఆదివారం సహకార సంఘాలను సందర్శించి కంప్యూటరైజేషన్ పురోగతి పరిశీలించారు. ఈ సందర్భంగా కొవ్వూరులోని శ్రీరామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మరియు కాపవరంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సందర్శించి కంప్యూటర్జేషన్ పరిశీలించారు. కొవ్వూరు డివిజన్లో 58 సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. కంప్యూటరేజేషన్లో డిసిటి సైన్ ఆఫ్, మరియు ఫ్రీ మైగ్రేషన్ స్టేజ్ రెండిటినీ తూర్పుగోదావరి జిల్లా లో గల 107 సంఘాలు పూర్తి చేశాయి. ప్రస్తుతం మూడవ దశైన ఆన్లైన్లో ఓచర్ల నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి ఎం జగన్నాథరెడ్డి కొవ్వూరు డివిజన్లో మరియు రాజమండ్రి డివిజన్లో గల సహకార సంఘాలన్నీ మార్చి నెలలో పూర్తిస్థాయిలో కంప్యూట రై జేషన్ పూర్తి చేసుకుని ప్రతి సహకార సంఘం ఈ పాక్స్ గా రూపాంతరం చెందాలని ఆదేశించినారు
