-పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం భక్తులు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. రామాలయాల్లో వేదమంత్రోచ్చరణల మధ్య కన్నుల పండువగా రాములోరి కళ్యాణం జరిపారు. కొత్తపేట బ్రాహ్మణ వీధిలోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మ వార్ల దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సుజనా చౌదరి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సుజనా చౌదరికి వేద బ్రాహ్మణులు తీర్థ ప్రసాదాలు అందజేశారు .
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ రచయితల ప్రజలందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని అభిలాషించారు. సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదన్నారు. ప్రజా రంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శనీయమన్నారు.
కళ్యాణం చూడటానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, పిళ్ళ శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), మరుపిళ్ళ రాజేష్, మహాదేవీ అప్పాజీరావు తదితరులు పాల్గొన్నారు.
మిథిలా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పరిమి మల్లేశ్వరరావు, సెక్రెటరీ మక్కా వెంకటేశ్వరరావు, వరికూటి కృష్ణారెడ్డి, బైపనేని కోటేశ్వరరావు, సంఘం మురళి, చెరుకూరి రాము, రేగళ్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామనవమిని పురస్కరించుకొని బ్రాహ్మణ వీధి కొత్తగుళ్లలోని రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నంబూరి శ్రీనివాస్, సెక్రెటరీ గొల్లపూడి శివకుమార్, రామాలయ ప్రతిష్టాపకులు గోపు మురళి ఆర్య, నగరేశ్వరాలయం ప్రతిష్టాపకులు తమ్మన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వించిపేటలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎలకల చలపతిరావు, అధ్యక్షులు ఎలకల వెంకటేశ్వరరావు (బాబు) సెక్రటరీ ఆబోతుల శివ తదితరులు పాల్గొన్నారు.
హైందవి జాతివాద సంస్థ ఆధ్వర్యంలో స్వాతి రోడ్డు శివాలయం సెంటర్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో బోయపాటి నాని చౌదరి, ప్రతాప్ రెడ్డి, క్రాంతి తిలక్, యేదుపాటి రామయ్య, తదితరులు పాల్గొన్నారు.