Breaking News

పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

-ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఊర్మిళ నగర్ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ ఆధ్వర్యంలో భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడం భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం బీజేపీ లక్ష్యమన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక గత పది సంవత్సరాల మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి ఆవిర్భవించిందన్నారు.
కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు యర్రా సునీత, బిజెపి నాయకులు యర్రా రవి చౌదరి, పోతిన భేసు కంటేశ్వరుడు, వేరుకొండ ఉమాకాంత్, బెవర మురళి, దాడి జగన్, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

క్రాంబ్వే రోడ్డు, శివాలయం సెంటర్ లో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బేన్నా బత్తుల సోమేశ్వరరావు,గొల్ల విశ్వేశ్వరరావు, కందుల సుబ్రహ్మణ్యేశ్వర రావు, బొల్లా వెంకటేష్, జ్ఞాన బాలన్, అల్లంకి శ్రీనివాసు , యజ్ఞ శ్రీనివాసు, మనోజ్ ,పిల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కుమ్మరిపాలెం మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 39 వ డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్ లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్థానికంగా ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కేక్ కట్ చేశారు .స్థానిక పేద మహిళలకు చీరలను పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్పొరేటర్ నరేంద్ర రాఘవను, మద్ది రాజీవ్ ను అభినందించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ,కుమ్మరిపాలెం మండల అధ్యక్షులు మద్ది రాజీవ్ కృష్ణ, రెడ్డిపల్లి రాజు, పచ్చిపులుసు ప్రసాదు, గన్నవరపు శ్రీనివాసరావు, నెక్కట్ల రాజా, కొత్త మాసు పిచ్చయ్య, రామాంజనేయులు ఆనంద శర్మ, నల్లమిల్లి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

కొత్తపేట మండల అధ్యక్షులు మొరం సత్యసాయి ప్రసాద్, బైపిల్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్థానిక మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సుజనా స్వయంగా భోజనం వడ్డించారు. కార్యక్రమంలో 51 వ డివిజన్ బీజేపీ ఇంచార్జ్ దొడ్ల రాజా, 52వ డివిజన్ ఇంచార్జ్ అడ్డూరి భాస్కరరావు, ఒమ్మీ అన్నపూర్ణ, పైలా సోమి నాయుడు, పైలా సురేష్, పిల్లా రవి, కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీ రావు, మారుపిళ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

చిట్టినగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో చిట్టినగర్ చౌరస్తాలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో యలకల అనిల్, కొరగంజి మాధవ, పైలా హేమ కుమార్, ఆకారపు విజయ కుమారి , బెవర మురళి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *