Breaking News

మెగా జాబ్ మేళాకు క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టేషన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న గుంటూరు మెగా జాబ్ మేళాకు ఈ నెల 7 (సోమవారం) నుండి నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టేషన్ చేసుకోవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో నగరంలో 10వ తరగతి పైన చదివిన నిరుద్యోగ యువతకు వారి అర్హతకు తగిన విధంగా ఉండేలా షుమారు 50 కంపెనీల నుండి ఉద్యోగాలు అందించేలా గుంటూరు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామన్నారు. ఐటి, నాన్ ఐటి, బ్యాంకింగ్, ఫార్మసీ, నర్సింగ్ రంగాల్లోని వివిధ కంపెనీలు నిర్వహించే ఉద్యోగాల కల్పనకు, ఈ నెల 9న విజ్ఞాన మందిరంలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వర్క్ షాప్ జరుగుతుందన్నారు. నగరంలో ఆసక్తి కల్గిన నిరుద్యోగ యువత తమకు అందుబాటులోని వార్డ్ సచివాలయంలో క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టేషన్ చేసుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *