గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
ఈ నెల 7వ తేది (సోమవారం) ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ 2025-26 వార్షిక బడ్జెట్ పై కౌన్సిల్ సమావేశం కౌన్సిల్ హాల్లో జరుగుతున్న సందర్భంగా ప్రతి సోమవారం గుంటూరు నగరపాలక సంస్థలో నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్నిసోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జిఎంసి ప్రధాన కార్యాలయంలోని జనన మరణ నమోదు కార్యాలయం వద్ద (పార్కింగ్ వద్ద) నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు సదరు స్థల మార్పు అంశాన్నిగమనించాలని కోరారు.
Prajavartha Online Telugu News