విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గంలో హల్ డివిజన్ లో జరిగిన శ్రీరామనవ వేడుకలలో టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 3 డివిజన్ కరెన్సీ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో, రామచంద్ర నగర్ రామాలయం వద్ద, గుణదల సాయి యస్ వద్ద, 6వ డివిజన్ గులం మొహిద్దిన్ నగర్ లోని లయన్స్ క్లబ్ రామాలయం వద్ద, మారుతి నగర్ కోకోకోలా స్ట్రీట్ లోని రామాలయం వద్ద, 19వ డివిజన్ లబ్బిపేట అమెరికన్ హాస్పిటల్స్ సమీపంలోని ఇందిరా టవర్స్ వద్ద, 4వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలో, 12 డివిజన్ అయ్యప్ప నగర్ లో, మాచవరం టౌన్ ఏరియాలో జరిగిన శ్రీరామ వేడుకల్లో గద్దె క్రాంతి కుమార్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.
Prajavartha Online Telugu News