బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తో మర్యాదపూర్వక భేటి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన పారదర్శకంగా ఉందని బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కి వివరించినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.ఏపీ లో పర్యటిస్తున్న వారు బుధవారం గుణదల లోని అవినాష్ స్వగృహానికి మర్యాదపూర్వకంగా విచ్చేయాగ బ్రిటీష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మరియు బ్రిటిష్ ప్రభుత్వ సలహాదారు శ్రీమతి నళిని రఘురామన్ గారిని శాలువతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ కుటుంబ సభ్యులను,రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబుని, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావుని, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గని, వైసీపీ ఫ్లోర్ లీడర్  వెంకట సత్యనారాయణ మరియు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్పొరేటర్లు ,డివిజన్ ఇన్ ఛార్జ్ లను వారికి పరిచయం చేశారు. మహిళ సాదరికతలో ఏపీ మొదట స్థానంలో ఉందని,ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే నిరుపేదల సంక్షేమం కోరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు,ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ళ పట్టాల పంపిణీ గురుంచి అవినాష్ వివరించారు. బ్రిటన్ వ్యాపార సంస్థలు తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తున్న వారి సేవలను అవినాష్ అభినందించారు. బ్రిటన్ లో ఉన్న రాజకీయ వ్యవస్థ పనితీరు, అభివృద్ధి గురించి మన కార్పొరేటర్లకు వివరించి తమ సలహాలు సూచనలు అందజేసినందుకు వారు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఫ్లెమింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్  పరిపాలన వ్యవస్థ బాగుందని, ఆయన విజన్ ఆదర్శవంతంగా ఉందని కొనియాడారు. జగన్ ని కలిసినప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఆయన తీసుకొంటున్న చర్యలు గురుంచి వివరించిన తీరు గురుంచి కొనియాడారు. యునైటెడ్ కింగ్ డమ్ నుండి బ్రిటన్ బయటకు వచ్చేసింది అని ఇక పై తమ దేశంలో ఎవరైనా చదువుకోవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చు అని దీనివలన అన్ని దేశాలకంటే భారతదేశానికి ఎక్కువ లాభమని అన్నారు. ఆంద్రప్రదేశ్ యువత చాలా చురుకుగా ఉంటారని మా దేశంలో చదువుకోవడానికి వచ్చే వారికి వీసా జారీ సులభతరం చేశామని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు కార్యక్రమం అధ్బుతంగా ఉందని,ఈ పధకం కింద తూర్పు నియజకవర్గంలో నూతనంగా రూపుదిద్దుకున్న పాఠశాలలను తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని, అదేవిధంగా ఈ పధకానికి బ్రిటన్ నుండి ఆర్థిక సహకారం అందేలా కృషి చేస్తానని చెప్పారు. చిన్నవయసులోనే రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్ అయిన భీమిశెట్టి ప్రవల్లిక ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్ లు, ఇన్ ఛార్జ్ లు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం

ఇంద్రకీలాద్రి,  నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమ‌వారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *