-ఆపదలో ఉన్నవారికి అండగా ఉండే పధకం…
-10.19 లక్షల నీరు పేద కుటుంబాలకు ” వైఎస్సార్ భీమా ” ద్వారా ఉచిత భీమా రక్షణ…
-పూర్తి ప్రీమియం చెల్లింపు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయి విస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆలంబనగా వైఎ ప్సార్ భీమా అండగా విలుస్తోంది. వైఎస్సార్ భీమా పధకం ఆపదలో ఉన్నకుటుంబాలకు రక్షణగా విలుస్తోంది. అనుకోని విపత్తు కారణంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం వైఎస్సార్ భీమా ద్వారా అందుతుంది. గత ఏడాది ఆర్థిక సంవత్సరం వరకూ ఈపధకానికి భీమా ప్రీమియంలో సగం నగదును కేంద్రం అందించేది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈపధకానికి ఆర్థిక సహకారం నిలిపివేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియంను భరిస్తూ క్రొత్తగా వైఎస్సార్ భీమా పధకాన్ని రూపొందించింది. దీనిని గత సంవత్సరం 2020 అక్టోబరు 21న ప్రారంభించింది. పేదకుటుంబాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బియ్యంకార్డుదారులను ఈ పథకానికి అర్హులుగా చేసింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వాలంటీర్లతో అర్హులను గుర్తించి వారికి ఇవైసి అప్డేట్ చేసి భీమా అర్హులుగా ఇటీవల నమోదు చేపట్టారు.
పేదనిరు పేదలకు సామాజిక భద్రతే ధ్యేయంగా జిల్లాలో 10.71 లక్షలమంది బియ్యం కార్డుగల కుటుంబాలకు భీమా వర్తింప చేస్తోంది. వారికి భీమా కల్పించడానికి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి వారి జన్ ధన్ బ్యాంకు ఖాతాకు ఇ-కెవైసి జోడించే ప్రక్రియ చేపట్టి పూర్తి చేసారు. నమోదు చేసే సర్వేమ సుమారు 23 వేల మంది వాలంటీర్లతో చేపట్టి మారుశాతం పూర్తి చేసి జిల్లాలో 10.19 లక్షల మందిని వైఎస్సార్ భీమా పధకంలో వమోదు చేసి వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడం జరిగింది. జిల్లాలో అక్టోబరు 2020 నుంచి నేటి వరకూ 1039 మందికి భీమా క్లెయిమ్స్ పరిష్కరించి రూ. 21.32 కోట్లను వేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రమాదవశాత్తు ఈ అర్హులలో చనిపోయిన వారి కుటుంబాలకు గ్రామ సచివాలయం మంచి తక్షణ పాయంగా రూ. 10 వేలు అందిస్తోంది.
కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే అందే భీమా ప్రయోజనాలు…
-18-50 ఏళ్ల మధ్య వయసు ఉండి సహజ మరణం పొందితే ఆకుటుంబానికి రూ. 2 లక్షల రూపాయలు…
-18-50 ఏళ్ల మధ్య వయసు ఉండి ప్రమాద వశాత్తు మరణం లేదా పూర్తి స్థాయి అంగ వైకల్యం పొందితే రూ. 5 లక్షలు..
-51-70 ఏళ్ల మధ్య వయసు ఉండి ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తి స్థాయి అంగ వైకల్యం పొందితే రూ. 3 లక్షలు చొప్పున,
-18-70 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండి పాక్షిక శాశ్వత అంగ వైకల్యం పొందితే రూ. 1.50 లక్షలు.
గరికపూడి రమాదేవి. లంకపల్లి గ్రామం, పమిడిముక్కల మండలం… తన భర్త సీతారామాంజనేయులు (33) కూలి చేసి కుటుంబాన్ని పోషించేవారని అయితే విద్యుత్ షా తో గత ఏడాది అక్టోబరు 23న మరణించారన్నారు. తనభర్తకు పోస్టుమార్టం చేసి తీసుకువచ్చిన సమయంలో ఇద్దరు పిల్లలతో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకునేది ఎవరనే షాక్ లో పడి సృహ కోల్పోయానన్నారు. ప్రతీరోజూ బిడ్డలను చూసుకుని ఏడుస్తూ ఉండేదానినన్నారు. అయితే తన భర్త పేరు వైఎస్సార్ భీమా పోర్టల్లో నమోదై ఉందని వాలంటీర్ చెప్పారు. తనకు ఈ ఏడాది మార్చి 31వ భీమా మొత్తం రూ. 4 లక్షలు వస్తాయని చెప్పడంతో కొండంత ధైర్యం వచ్చింది. జీవితకాలం అంతా తోడుగా ఉంటావని చెప్పిన తన భర్త నన్ను, నాబిడ్డలను వదిలేసినా కుటుంబ యజమానిని కోల్పోయిన నాకు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి వైఎస్సార్ ఉచిత భీమా ద్వారా తనకు, తన బిడ్డలకు జీవితాన్ని ఇచ్చారు. ఇందుకు వారికి రుణపడి ఉంటానని చెప్పారు.
రత్నం నాగలక్ష్మి, మంటాడ గ్రామం, పమిడిముక్కల మండలం.. తనభర్త నాగమల్లేశ్వరరావు ప్రొయినర్ తోలేవారని అయితే ఈ ఏడాది మార్చి 14వ తేదీన గుండె నొప్పితో మరణించారన్నారు. తన భర్త మరణంతో 12 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లోడు, తాను ఎ లాబ్రతకాలని తల్లడిల్లి పోయామన్నారు. ఈసమయంలో తన భర్త పేరు వైఎస్సార్ భీమాలో నమోదై ఉందని మట్టి ఖర్చుల క్రింద రూ. 10 వేలను సచివాలయం సిబ్బంది వాణి, అమ్ములు అందించారు. మరణ ధృవీకరణ పత్రం వచ్చాక మంటాడ కెనరాబ్యాంకులో అందజేశాము. పిమ్మట 45 రోజులకు తన బ్యాంకు అకౌంట్లో రూ. 2 లక్షలు జమ అయ్యింది. ఆపొమ్ములో తనకుమారుడి పేర రూ. లక్ష రూపాయలు బ్యాంకులో వేసి రూ. 30 వేల రూపాయలు పెట్టి రెండు కుట్టుమిషన్ల కొనుక్కుని జీవనం సాగిస్తున్నానన్నారు. తద్వారా రోజుకు రూ. 1500 వరకూ ఆదాయం పొందుతున్నానన్నారు. వైఎస్సార్ భీమా నాబిడ్డకు, నాకు జీవనం సాగించేందుకు ధీమా కలిగించిందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
సిరివాడ జయ, జగ్గయ్యపేట.. తన భర్త మరణించడంతో నేను గతంలో కూలి పనులు చేసుకుంటూ చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణకు అనేక ఇబ్బందులు పడేవారమన్నారు. వేడు వైఎ ప్పార్ భీమా పథకం ద్వారా రూ. 2 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించడంతో కొంత సొమ్ముతో తన కుమార్తెకు వివాహం చేయగా మిగిలిన సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. సరైన సమయంలో వైఎస్సార్ భీమా పధకం వచ్చి మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు.