తాడేపల్లిగూడెం నుండి పశ్చిమ బెంగాల్‌కు మొదటిసారిగా ఉల్లిపాయల లోడిరగ్‌తో రవాణా అయిన కిసాన్‌ రైలు…

-246 టన్నుల ఉల్లిపాయల లోడిరగ్‌తో మాల్దా పట్టణానికి రవాణా అయిన మొదటి కిసాన్‌ రైలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు మద్దతుగా ఉండి వారి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ కల్పించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో జోన్‌లో వివిధ ప్రాంతాల నుండి ఇప్పటికే అనేక ‘‘కిసాన్‌ రైళ్ల’’ను ప్రారంభించి దక్షిణ మధ్య రైల్వే ముందంజలో ఉంది. ఇందులో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి కిసాన్‌ రైళ్లను నడిపింది. ఈ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెం నుండి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా పట్టణానికి 246 టన్నుల ఉల్లిపాయలను రవాణా చేసింది. విజయవాడ డివిజన్‌లోని బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ (బీడీయూ) బృందం తాడేపల్లి గూడెం నుండి ఉల్లిపాయల రవాణాకు ఆ ప్రాంతంలోని మరియు పరిసరాలలోని రైతులతో, వ్యాపారస్తులతో విజయవంతంగా సమావేశాలు నిర్వహించింది. రైల్వే వారిచే కల్పించబడిన వివిధ పథకాలు మరియు రాయితీలకు సంబంధించిన అంశాలపై బీడీయూ సరుకు రవాణా వినియోగదారులకు అవగాహన కల్పించింది. కేంద్ర ఫుడ్‌ ప్రాససింగ్‌ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ వారు ‘‘ఆపరేషన్‌ గ్రీన్స్‌-టీఓపీ టు టోటల్‌’’ పథకం కింద అందజేస్తున్న 50% రాయితీని సరుకు రవాణా వినియోగదారుల ఉత్పత్తులకు కూడా వర్తింపజేసింది. కిసాన్‌ రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సురక్షితంగా, ఆర్థిక ప్రయాజనకరంగా ఉండడమే కాకుండా తక్కువ రవాణా ఖర్చుతో నిరాటంకంగా మరియు రవాణా మార్గంలో వస్తువులు చెడిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇది తక్కువ పరిమాణంలో సరుకులను లోడిరగ్‌ చేసే వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు మరియు కార్గో నిర్వాహకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. జోన్‌లో కిసాన్‌ రైల్‌ లక్ష్యం భారీగా విజయవంతం కావడంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మాల్య ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం స్టేషన్‌ నుండి మొదటి కిసాన్‌ రైలును రవాణా చేసిన విజయవాడ డివిజన్‌ అధికారలను, సిబ్బందిని ఆయన అభినందించారు. జోన్‌లో వ్యవసాయ ఉత్పత్తుల లోడిరగ్‌కు అవకాశాలున్న ప్రాంతాలలో ఈ రైలు రవాణాతో కలిగే ప్రయోజనాలను తెలియజేసి మరిన్ని స్టేషన్‌లకు కిసాన్‌ రైలు రవాణాను విస్తరించాలని ఆయన అధికారులకు, సిబ్బందికి సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *