-టంగుటూరి దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
-రాజకీయాల్లో విలువల కోసం నిరంతరం శ్రమించారు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం కూడలి వద్దన గల ప్రకాశం పంతులు గారి విగ్రహానికి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ టంగుటూరి దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
రాజకీయాల్లో విలువల కోసం నిరంతరం శ్రమించారు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ప్రకాశం పంతులు జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకం అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రకాశం పంతులు గారి పట్ల ఉన్న అపార గౌరవానికి ఇది నిదర్శనం అన్నారు. క్విట్ ఇండియా, సైమన్ కమిషన్ గో బ్యాక్, ఉప్పు సత్యాగ్రహం వంటి పోరాటాలలో ముందుండి నడిపించిన నాయకులు ఆంధ్రకేసరి, తెల్లవాడి తుపాకీ తూటాలకు భయపడని ధీశాలి అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేవలందించారన్నారు.
తెలుగుజాతి కీర్తి ‘ప్రకాశం’ : మేయర్
ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని వారికి ఘన నివాళులర్పించిన నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, ప్రకాశం పంతులు ఆశయ సాధనకు కృషి చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళి అన్నారు.
కార్యక్రమంలో నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది, ఆంధ్రకేసరి అభిమానులు, విగ్రహ కమిటీ నిర్వహకులు తదితరులు ఉన్నారు.