తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహానుభావుడు టంగుటూరి…

-పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి గొప్ప న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహానుభావుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. సోమవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.  బుడితి రాజశేఖర్  ప్రసంగిస్తూ ప్రకాశం పంతులు క్విట్ ఇండియా ఉద్యమం, మద్రాస్ సైమన్ కమీషన్ పోరాటాల్లో పాల్గొని అకుంఠిత ధైర్యసాహసాలకు, అసమాన త్యాగనిరతికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమానికి ముందుగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్విగారు, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *