అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మరోసారి యువత పట్ల తన మక్కువను చాటుకున్నారు. ఈ ఏడాది నుంచి ఐఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు తన సొంత డబ్బును ప్రోత్సాహకంగా అందించి వారి కృషి, పట్టుదలను గుర్తించాలని మరింత మంది విద్యార్థులు మంచి చదువులు చదివేలా స్ఫూర్తిని కలిగించాలని భావించారు. అంధులో భాగంగా దేశంలో ఏ ఐఐటీలో అయినా సీటు సాధించిన విద్యార్థులకు తన సొంత నిధులను ప్రోత్సాహకంగా అందిస్థానని ప్రకటించారు. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కల్పిస్తారు. ఎస్టీ విద్యార్థులకు 1,00,000, ఎస్సీ లకు 75,000, బీసీ లకు 50,000, ఓసి విద్యార్థులకు 25,000 రూపాయలు తన సొంత డబ్బునుంచి ఇస్తానని ప్రకటించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి కన్నవారికి దేశానికి మంచి పేరు తేవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని తన వంతుగా ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు. యువత ప్రత్యేకించి విద్యార్థులు తమ సమస్యలు తెలియచేస్తే వెనువెంటనే అది పరిష్కారం అయ్యేదాకా మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి గారు అధికారులను పర్యవేక్షిస్తారు. అది ఎటువంటి తీవ్ర సమస్య అయినా సమసిపోవలసిందే. అంత శ్రద్ధ పెట్టడంవల్లే.. నిరంతరం పర్యవేక్షించడం వల్లే ప్రస్తుతం నూజివీడు ఐఐఐటి సమస్యల నుంచి బయట పడడమే కాదు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం అందులో చేరడానికి విద్యార్థులు భారీ సంఖ్యలో ఆసక్తి చూపారు.
Prajavartha Online Telugu News