Breaking News

విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్ప్ లు

-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 31 వ తేదీ
-ఏ డి శ్రీనివాస్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందచేయ నున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎ.వై. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు 2025–2026 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. 9వ మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (https://scholarships.gov.in) ద్వారా ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్థులు – పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ కోసం అదే పోర్టల్ ద్వారా అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రతిభావంతులైన విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 0884-2352303.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *