రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం, కేంద్ర కారాగారములో మంగళవారం రాత్రి 12.00ల వరకు రెవెన్యూ, ఫైర్, మెడికల్, ఎలక్ట్రికల్ విభాగాల సిబ్బంది, లోకల్ పోలీస్ మరియు ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీస్ వారి సహకారంతో “ఆపరేషన్ మహా సురక్ష” పేరుతో ‘ఆక్టోపస్’ టీమ్ మాక్ డ్రిల్ నిర్వహించింది. కారాగార పర్యవేక్షణాధికారి యస్. రాహుల్ ఆధ్వర్యంలో ఆక్టోపస్ జట్టు అధికారులు డీఎస్పీ లు బి. కృష్ణ, కె. శంకరయ్య, ఇన్స్పెక్టర్ బి. మురళి మరియు ఆక్టోపస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ డ్రిల్ ద్వారా జైలులో అత్యవసర పరిస్థితులు ఎదురై, అనుకోని ఘటనలు జరిగినప్పుడు, ఉగ్రవాద చర్యలు లేదా ప్రమాదకర సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం, మరియు రక్షణ వ్యవస్థలను సమర్ధవంతంగా వినియోగించి ప్రతిస్పందించడం ఉద్దేశ్యంగా నిర్వహించడం జరిగింది. జైలు అధికారులకు, సిబ్బందికి అత్యవసర పరిస్థితులలో సురక్షిత చర్యలు చేపట్టడం కోసం అవసరమైన మార్గదర్శకాలను ఆక్టోపస్ జట్టు బృందం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జైలర్లు, డిప్యూటీ జైలరు మరియు గార్డింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News