Breaking News

ఉద్యోగుల సమస్యల సానుకూల పరిష్కారానికి అన్నివిధాలా ప్రయత్నం చేస్తాం : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ ఉద్యోగులు,ఫెన్సనర్ల సమస్యల సానుకూల పరిష్కారానికి అవసరమైన ప్రయత్నం చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈసమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగులకు సంబంధించి పెండిగ్ డిఏలు,పిఆర్సి బకాయిలు,ఆర్జిత సెలవుల నగదు చెల్లింపు బాకాయిలు తదితర అంశాలను సిఎస్ దృష్టికి తెచ్చారు.అనంతరం సిఎస్ మాట్లాడుతు ఈప్రభుత్వం వచ్చాక మొదటి సారి జరిగిన ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపిన అన్ని అంశాలను నమోదు చేయడం జరిగిందని వాటన్నిటినీ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్ళి సకాలంలో పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ ఉద్యోగ సంఘాలకు చెప్పారు.
ఈసమావేశంలో సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు,రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి,టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,ఆర్థిక,ప్రణాళికా శాఖల ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్,విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్,వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు,కళాశాల విద్యా డైరెక్టర్ భరత్ గుప్త,ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్ అల్లాడ తదితర అధికారులు పాల్గొన్నారు.
అలాగే ఉద్యోగ సంఘాల నుండి ఎపి ఎన్జిజిజిఓ అధ్యక్షులు విద్యాసాగర్,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ మోహన్,రాష్ట్ర టీచర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్,ఎపి ప్రోగ్రస్సివ్ రికగ్నైజడ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య,ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,ఎపి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ప్రసాద్,ఎపి టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జి.హృదయరాజు,ఎపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.సూర్యనారాయణ,ఎపి ఉపాధ్యాయ సంఘం నుండి బాలాజీ,ఎపి ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్ నుండి శ్రీనివాసరావు,ఎపి ప్రభుత్వ క్లాస్ 4 ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ నుండి మల్లేశ్వరరావు, ఎపి ప్రభుత్వ క్లాస్ 4 ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ నుండి శేఖర్,ఎపి కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఫణి పేర్రాజు,ఎపి స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ప్రత్యేక ఆహ్వానితులు)వెంకటేశ్వరరావు,స్టేట్ గవర్నమెంట్ ఫెన్సనర్ల అసోసియేషన్ ఎపి(ప్రత్యేక ఆహ్వానితులు)శాస్త్రి మాట్లాడుతూ వివిధ ఉద్యోగులకు సంబంధించిన పలు పెండింగ్ అంశాలను సిఎస్ విజయానంద్ దృష్టికి తెచ్చారు.ఇంకా ఈసమావేశంలో ఆయా ఉద్యోగ సంఘాల జనరల్ సెక్రటరీలు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *