Breaking News

కె.ఎల్ రావు పార్క్‌ అధునీక‌ర‌ణ పనులు…

-న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ లంబాడి పేట నందలి డా.కె.ఎల్ పార్క్‌ను నగర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మ బుధ‌వారం అధికారులతో కలసి పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక నేతలు, అధికారుల‌తో మేయ‌ర్ మాట్లాడారు. ముందుగా స్కేటింగ్ కోసం ప్లొరింగ్‌ను సిద్దం చేయాల‌ని, బోటింగ్‌ను వాడుక‌లోని తీసుకురావ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. పార్క్ లో ఎక్కువ భాగంగా లోతట్టుగా ఉండ‌టాని గ‌మ‌నించిన మేయ‌ర్ ఎత్తుపల్లాలు లేకుండా స‌రిచేయాల‌న్నారు. మోట‌ర్‌లు బోట్ల కు తగిన రిపేరు చేయించాల‌న్నారు. పార్క్‌ నందలి అవసరమైన చోట్ల అంద‌మైన టైల్స్‌తో ఆకర్షనియంగా ఆధునికరించాల‌న్నారు. అదే విధంగా చిన్నారుకుల ఆట‌వ‌స్తువుల ఏర్పాటు చేయాల‌న్నారు. త‌ర్వ‌లోనే పూర్తిస్థాయిలో పార్కును అభివృద్ధి చేస్తామ‌న్నారు. పార్క్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి ఆవరణ అంతయు గ్రీనరి అభివృద్ధి పరచుటతో పాటుగా ఎత్తుగా పెరిగిన మొక్కలు ట్రిమ్మింగ్ చేయాలని మరియు పార్క్ ఆవరణలో వ్యర్ధములను తొలగించి పార్క్ ఆవరణ పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి, ఉద్యాన అధికారి జె.జ్యోతి, ఎస్టేట్ అధికారి ఎ.శ్రీధర్ మరియు ఇతర అధికారులు సిబ్బంది వై.ఎస్.ఆర్. పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *