కొవ్వూరు/ భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాలకు చెందిన మెగా DSC-2025 నందు ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు తేది 03-10-2025 నుండి 10-10-2025 వరకు ఇండక్షన్ ట్రైనింగ్ నిర్వహించనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి ఈ నారాయణ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం రెసిడెన్షియల్ మోడ్‌లో జరుగుతుందనీ, ట్రైనింగ్‌లో పాల్గొనడం తప్పనిసరి అని తెలియ చేశారు. శిక్షణ పూర్తయిన తరువాతే ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందనీ పేర్కొన్నారు. శిక్షణకు హాజరు కాని వారు తదుపరి విడతలో శిక్షణ పూర్తిచేసిన తరువాత మాత్రమే పోస్టింగ్ పొందగలరనీ ఈ సందర్భంగా వెల్లడించారు.
ముఖ్య గమనికలు :
ట్రైనింగ్ క్యాంప్‌లో హాజరయ్యే ఉపాధ్యాయులు ఎవరికి వారు వారికి సంబంధించిన బెడ్ షీట్స్, వ్యక్తిగత సామగ్రి, ఉదయం జాగింగ్ కోసం రన్నింగ్ షూస్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ వెంట తెచ్చుకోవాలన్నారు.
అనారోగ్యంతో ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు అవసరమైన మందులను శిక్షణా కార్యక్రమం పూర్తి కాలానికి వెంట తీసుకు రావాలన్నారు. అదే విధంగా
ఫార్మల్ డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కోరారు.
—
శిక్షణ వేదికలు / కేటగిరి వారీగా
వేదిక 1: ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గొల్లలకోడెరు రోడ్, భీమవరం (స్కూల్ అసిస్టెంట్స్ – తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం)
వేదిక 2: స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ, సీతారాంపురం, నరసాపురం
(స్కూల్ అసిస్టెంట్స్ – సోషల్ స్టడీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్)
వేదిక 3: SKSD మహిళా కళాశాల, ఓల్డ్ టౌన్, తణుకు
(సెకండ్ గ్రేడ్ టీచర్స్)
వేదిక 4: CSN ఎస్టేట్, ఇండస్ట్రియల్ ఏరియా (సెకండ్ గ్రేడ్ టీచర్స్)
Prajavartha Online Telugu News