Breaking News

“సూపర్ GST – సూపర్ సేవింగ్స్”

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
GST 2.0 సంస్కరణల ప్రయోజనాల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న “సూపర్ GST – సూపర్ సేవింగ్స్” ఒక నెలపాటు ఉత్సవాలలో భాగంగా, మొదటి వారపు కార్యక్రమాల కొనసాగింపులో, బాలాజీ తిరుపతి జిల్లాలోని 6 సర్కిల్స్‌లోని కమర్షియల్ టాక్స్ శాఖ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్ GST ఛాంపియన్‌షిప్ శ్రీ శుభమ్ బన్సాల్, JC, తిరుపతి జిల్లా మానిటరింగ్ అధికారి శ్రీ J.V.M. శర్మ, అదనపు కమిషనర్ (GST) మరియు నోడల్ అధికారి శ్రీ కె. నాగేంద్ర, అదనపు కమిషనర్ (GST) ఆధ్వర్యంలో, అన్ని జిల్లా స్థాయి అధికారులు, MPDOలు, మునిసిపల్ కమిషనర్లు, గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం సిబ్బందితో సమన్వయంతో క్రింది కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

ఈరోజు GST 2.0 సూపర్ GST – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలు

పట్టణ & గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు సభ్యులు, MPDO కార్యాలయ సిబ్బందితో గూడూరు సర్కిల్‌లోని కోట మండలంలో మరియు తిరుపతి ఆర్.సి.రోడ్డు పరిసర ప్రాంతంలో నిర్వహించబడ్డాయి.

అవగాహన కోసం దుకాణాల సందర్శన

గూడూరు సర్కిల్‌లోని కోట మండలంలో, చంద్రగిరి మండలంలో, తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలో ఉన్న వివిధ షాపులు, సంస్థలను సందర్శించి, ధరల తగ్గింపు అంశాలపై ఫ్లెక్సీలు ప్రదర్శించవలసిందిగా సూచించారు.

పాంప్లెట్‌ల పంపిణీ

ధరల తగ్గింపు ప్రదర్శనపై పాంప్లెట్‌లు కోట మండలంలోని గూడూరు సర్కిల్ మరియు తిరుపతి నగరంలోని కొన్ని ప్రాంతాలలో పంపిణీ చేయబడ్డాయి.

ప్రాక్టికల్ ధరల ప్రదర్శన & ఎగ్జిబిషన్

తిరుపతి-2 సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ (ST), తిరుపతి మునిసిపల్ కమిషనర్, డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ కలిసి, కరకoబాడి రోడ్డులోని వివిధ దుకాణాలలో వస్తువుల ధరల్లో మార్పులపై ప్రత్యక్ష ప్రదర్శన, ఎగ్జిబిషన్ నిర్వహించారు.

గృహస్థాయి అవగాహన కార్యక్రమం

వినియోగదారుల అవగాహన కోసం, తిరుపతి పట్టణంలోని కరకంబాడి రోడ్ నందకం అపార్ట్మెంట్స్ పరిసరాలు & సుబ్బారెడ్డి నగర్ ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *