-కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“వికాస” ఆధ్వర్యంలో నవంబర్ 1 వ తేదీ శనివారం ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ పరిసరాల్లోని “వికాస కార్యాలయం” (బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అర్హులైన అభ్యర్థులుకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు . ఎంపికైన వారికి నెలకు రూ.10,000/- నుండి రూ.25,000/- వరకు వేతనం, అదనంగా ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సదుపాయాలు ఆయా సంస్థల ప్రకారం అందజేయబడతాయి.
ఆసక్తిగల అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లతో పాటు జెరాక్స్ కాపీలు తీసుకొని తప్పనిసరిగా హాజరు కావాలనీ వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.. లచ్చా రావు కోరారు. మరిన్ని వివరాల కోసం : 7660823903
లేదా వెబ్‌సైట్ :
www.vikasajobs.com ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలనీ తెలియ చేసారు.
Prajavartha Online Telugu News