రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు (గురువారం) తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నందు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం. మాధురి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి బి. పద్మ వారి ఆధ్వర్యంలో ప్యానల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఫ్యామిలీ కోర్ట్ జడ్జి ఎం. మాధురి వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతి గురించి సమీక్షించారు. కేసులను యథాశీఘ్రం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు వెంటనే తెలియజేయాలని సూచించారు. అలాగే క్రిమినల్ కేసులకు సంబంధించిన బెయిల్ అర్జీల వివరాలు కూడా తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News