రాజమహేంద్రవరం రూరల్ / కడియం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలైన రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు, కడియం మండలం ఆవ ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రైతులతో మాట్లాడం జరిగింది. మొంథా తుఫాను కారణంగా మునిగిన వరి పొలాలు, ఒరిగిన పంటలను పరిశీలించిన కలెక్టర్ రైతులను ఆదరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం వారి పక్కనే ఉందని హామీ ఇచ్చారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, పంట నష్టాలను పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహిస్తు న్నారని తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపరిహారం కోసం సరైన నివేదిక ప్రభుత్వానికి పంపబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ నిపుణులు పంట మునిగిన లేదా ఒరిగిన సందర్భాల్లో రైతులు అనుసరించవలసిన సస్య రక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. పంటల పునరుద్ధరణకు అవసరమైన మార్గదర్శకాలు కూడా అందజేశారు. సందర్శనలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, తహసిల్దార్లు శ్రీనివాస్, సునీల్ కుమార్, ఇతర వ్యవసాయ సిబ్బంది, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News