కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్. కృష్ణ నాయక్ గురువారం సాయంత్రం కొరుకొండ మండలంలోని బురదకలువ (శ్రీరంగపట్నం) గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గోకవరం మండలం అచ్యుతాపురం వద్ద చెరువు గండి కొట్టడం వలన నీరు పొంగి ప్రవహించిన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టిన ఆర్‌డీఓ , స్థానిక ప్రజలతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ముంపు ఘటనలు చోటు చేసుకోకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తరువాత శ్రీరంగపట్నం గ్రామంలో బాధిత కుటుంబాలకి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆర్‌డీఓ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News