-దుర్గమ్మ గుడి చైర్మన్ బొర్రా రాధ కృష్ణ (గాంధీ)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిని అభివృద్ధి చేసేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని )ఎమ్మెల్యే సుజనా చౌదరి , దేవాదాయ శాఖ అధికారులందరి సమన్వయంతో కలిసి పని చేస్తానని దుర్గమ్మ గుడి నూతన చైర్మన్ బొర్రా రాధ కృష్ణ (గాంధీ) అన్నారు. ఇటీవల దుర్గమ్మ గుడి నూతన చైర్మన్ గా నియమితులైన సందర్భంగా టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతావుల్లా ఆధ్వర్యంలో 54 వ డివిజన్, గణపతి రావు రోడ్డు లోని ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని) కార్యాలయంలో సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు..
ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , టీడీపీ తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, దుర్గమ్మ గుడి పాలక మండలి సభ్యురాలు శుకాసి సరిత, ఏ ఏం సీ మార్కెట్ వైస్ చైర్మన్ పాల మాధవ్, పశ్చిమ తెలుగు యువత ప్రెసిడెంట్ మాధవ్ కూటమి నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొర్రా రాధ కృష్ణ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్( చిన్ని )ఎమ్మెల్యే సుజనా చౌదరి దుర్గ గుడి సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు.భక్తుల సౌకర్యాలే కేంద్రంగా, అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేలా అందరితో కలిసి సమన్వయంతో కలిసి పనిచేస్తానన్నారు. సన్మాన సభ ఏర్పాటు చేసి టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా , కూటమి నేతలకు ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మొహమ్మద్ జాహిద్,దీటి ప్రభు దాస్, సూర్య దుర్గ, అన్సార్, మంగళపురి మహేష్ , గడ్డిపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు..
Prajavartha Online Telugu News