మైలవరం తాలూకా యూనిట్ కు ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు

-ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనమే ఈ ఎన్నిక జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మైలవరం తాలుక యూనిట్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఉద్యోగులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరింత కాపాడే విధంగా సంఘ సభ్యులు ఉండాలని జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి పి రమేశ్ అన్నారు. మైలవరం అర్ అండ్ బి వసతి గృహం నందు బుధవారం జరిగిన ఎ.పి.యన్.జి.జి.ఓస్ అసోసియేషన్ మైలవరం తాలూకా యూనిట్ నూతన సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి పి రమేశ్ హాజరైనారు.
జిల్లా అధ్యక్ష కార్యదర్శి లు డి సత్యనారాయణ రెడ్డి, పి రమేష్ మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా ఉద్యోగుల హక్కులు, డిమాండ్లపై పోరాడుతున్న సంఘం ఏపీ ఎన్జిజీస్ సంఘం అని, ఉద్యోగులకు అనేక రాయితీలను కల్పించిన చరిత్ర కూడా ఏపీ ఎన్జిజీస్ సంఘానికి ఉందని, ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే విధంగా ముందుకు సాగుతున్న సంఘం ఏపీ ఎన్జిజీస్ సంఘమని అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు జిల్లా పక్షాన తెలియజేస్తున్నామన్నారు.
ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల బృందాన్ని అభినందించారు. ఎన్నికల అధికారి యం. రాజుబాబు మాట్లాడుతూ ఎపి ఎన్జీజీఓస్ అసోసియేషన్, మైలవరం తాలూకా యూనిట్ ఎన్నికల్లో ఎస్ డి. వజిరుద్దీన్ ఖాదీర్, సిహెచ్ నరసింహారావు ప్యానల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. అధ్యక్షులుగా ఎస్ డి. వజిరుద్దీన్ ఖాదీర్, సహాధ్యక్షుడుగా డి రవికుమార్, కార్యదర్శిగా సిహెచ్ నరసింహారావు, కోశాధికారిగా ఎన్ ఎన్ సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా సిహెచ్ శ్రీనివాసరావు, పిపి భాను ప్రసాద్, వై ఎస్ భాగ్యలక్ష్మీ, సంయుక్త కార్యదర్శులుగా బి కృష్ణ, కె ఉమ మహేశ్వరరావు, పివి శివరావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా కె పూర్ణిమ నాగరత్నం ఎన్నికైనట్లు ఆయన పేర్కొన్నారు. సహాయ ఎన్నికల అధికారి కె వి శివారెడ్డి, పర్యవేక్షకులు జి రామకృష్ణ వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ నగరశాఖ సహాధ్యక్షులు రాజశేఖర్, గ్రామ వార్డు సచివాలయం అధ్యక్షులు షేక్ జానీ భాష, పూర్వపు అధ్యక్షులు రఘుపతి, మైలవరం ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ నాయకులు. వివిధ శాఖల ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *