Breaking News

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి… : కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
“దివ్యాంగ శక్తి” పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని స్థానిక హైటెక్ బస్టాండ్ వద్ద కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబాల చెరువు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి , కలెక్టర్ కీర్తి చేకూరి లు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారికి ఉత్సాహం నింపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అధికారులు దివ్యాంగులతో ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా ప్రభుత్వం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఐదు రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. వీటిలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 21 కేటగిరీల్లో వైకల్యం ఉన్న దాదాపు 40 వేల మంది దివ్యాంగులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరు తుందన్నారు. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు తదితర అన్ని రంగాల్లో దివ్యాంగులు ఆత్మనిర్భరులుగా ఎదగడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమాలు వారిలో నమ్మకం, ఉత్సాహం, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలనే ధైర్యాన్ని పెంపొందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రివర్యులు గతంలో ప్రకటించిన 7 పథకాలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని “దివ్యాంగ శక్తి” ద్వారా అమలు చేస్తున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, డి.ఆర్.ఓ టి. సీతారామమూర్తి, జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్. మూర్తి, ఏ.వో మహమ్మద్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *