Breaking News

ఏప్రిల్ 7న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా

-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

-జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :

తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7వ తేదీ (మంగళవారం ) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేళాలొ సన్ రైస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్, అర్ ఎస్ అర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రెడ్ రైయిట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, ఫ్లిప్కార్ట్, వేరహౌజ్, డీమర్ట్ మరియు కంపెనీలోని రాజమండ్రి పరిసర ప్రాంతంలో గల పలురకాల పోస్టల భర్తీకొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడనున్నాయని ఆయన తెలిపారు.
10, ఐ టీ ఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ నుండి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన మరియు ఎమ్ బిఏ పూర్తి చేసి అనుభవం ఉన్న లేదా ఆశక్తి గల 19 నుండి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా employment.ap.gov.inలింక్ ద్వారా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయి, రెజ్యూమే, ఆధార్ మరియు సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సిద్ధంగా మేళాకు హాజరుకావాలని సూచించారు.
మరిన్ని వివరాలకు 9533221189 నంబర్‌ను సంప్రదించవచ్చని జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *