Breaking News

ప్రజల సస్పస్యకు నాణ్యమైన పరిష్కారాలను అందించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :

ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చే ప్రజలకు ఉన్న సమస్యలకు నాణ్యమైన పరిష్కారాల అందించాలని విజయవాడకు సంస్థ కమిషనర్ ధ్యానచంద్రా అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం సోమవారం ప్రధాన కార్యాలయంలో గల గమామిడి కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు తెచ్చే సమస్యలకు నాణ్యమైన పరిష్కారాల అందించాలని, ఈవారం తెచ్చిన సమస్యలకు శనివారం కల్లా పరిష్కారం అందించేటట్టు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలకు ప్రాధాన్యమిస్తూ వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు.

ఈ సోమవారం వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 19 ఫిర్యాదులు అందగా అందులో పట్టిన ప్రణాళిక సంబంధించినవి 11, ప్రజారోగ్యం 3 ఇంజనీరింగ్ 2, రెవెన్యూ విభాగం 1, హోసింగ్ 1, యూసీడి 1

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి.చంద్రశేఖర్, ఏ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) వి.చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్)చంద్రశేఖర్, ఆర్ ఎఫ్ ఓ మల్యాద్రి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోపాలకృష్ణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ పి.మోహన్ బాబు, ప్రభాకర్, వి ఏ ఎస్ డి.హరీష్, బయాలజిస్ట్ వి. కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *