విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి ఫైర్ సేఫ్టీ వీక్ లో భాగంగా శుక్రవారం ఉదయం NTR కాలనీలో రవీంద్ర భారతి నెక్స్ట్ జెన్ పాఠశాల లో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలను ఎలా నిరోధించాలి అనే అంశం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా వస్తుంది, అగ్ని ప్రమాదం జరగకుండా చుట్టూ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమేం ఉండాలి, అగ్ని ప్రమాదం సంభవిస్తే రూమ్లో పొగ మొత్తం ఉన్నప్పుడు నేల మీద పాకుతూ ఎలా బయటికి రావాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ యఫ్ ఓ మల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, ఆటోనగర్ ఫైర్ ఆఫీసర్ రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News