Breaking News

నిర్మాణ వ్యర్ధాలతో సంపద సృష్టించేందుకు సి అండ్ డి ప్లాంట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని నిర్మాణ వ్యర్ధాలతో సంపదను సృష్టించేందుకు సిఎన్డి ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల బిల్డర్లు అందరూ అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లోని సి అండ్ డి ప్లాంట్ కు నిర్మాణ వ్యర్ధాలను పంపించాలని చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్ అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడున్నా సరే వాటిని అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లోకి తరలించని తమ సిబ్బందిని ఆదేశించారు. అక్కడున్న సిఎన్డి ప్లాంట్ని ఉపయోగించి నిర్మాణ వ్యర్థాలతో పాదచర్ల కోసం వేసే పేపర్ బ్లాక్స్, సిమెంట్ ఇటుకలు తయారుచేసి విజయవాడ నగరపాలక సంస్థ చేసే అభివృద్ధి పనుల్లో ఉపయోగిస్తున్నందున, ప్రజలకు కావాలన్నా విజయవాడ నగరపాలక సంస్థ వారు నుండి పొందవచ్చని అన్నారు. పట్టణ ప్రణాళిక సిబ్బంది ఎప్పటికప్పుడు డ్రోన్ తో పర్యవేక్షిస్తూ నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడా లేకుండా నిర్ధారించుకోవాలని అన్నారు. బిల్డర్లు నిభందనలు ఉల్లంగిస్తే చట్ట రీత్యా చర్యలో భాగంగా పెనాల్టీ తప్పవని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *