Breaking News

సెలవు రోజుల్లో కూడా పనిచేయనున్న క్యాష్ కౌంటర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సౌకర్యర్థం నగరంలోని క్యాష్ కౌంటర్లు సెలవు రోజుల్లో కూడా అన్నియును అందుబాటులో ఉన్నాయన్నారు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి.సృజన శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయలపై 50% వడ్డీ రాయితీ, 2026- 27 సంవత్సరమునకు ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ, పండుగ రోజుల్లో కూడా ప్రజలు వినియోగించుకోగలరని అన్నారు. నగర పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్లు, 286 సచివాలయాల్లో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సిబ్బంది ఉదయం అందుబాటులో ఉంటారని ప్రజలు పన్నులు చెల్లించవచ్చని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఆన్లైన్లో ఈ వెబ్సైటు www.cdma.gov.in, ద్వారా చెల్లింపులు చేయవచ్చని, పురమిత్ర యాప్ ద్వారా కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని అన్నారు.
ఈ అవకాశం కేవలం ఏప్రిల్ 30, 2026 వరకు ఉన్నందున, ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *