విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టర్ డా. జి.లక్ష్మీశ నందిగామ డీవీఆర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు. చిన్నారులలో వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువుకు సంబంధించిన రికార్డులను ప్రత్యక్షంగా పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం వివరాలను పరిశీలించారు. చిన్నారులలో తీవ్ర పోషకాహార లోపం (సివియర్ ఎక్యూట్ మాల్న్యూట్రిషన్- ఎస్ ఏ ఎం), మిత పోషకాహార లోపం (మోడరేట్ ఎక్యూట్ మాల్ న్యూట్రిషన్ -ఎం ఏ ఎం) ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. పూర్వ ప్రాథమిక విద్యను అత్యున్నత ప్రమాణాలతో అందించేందుకు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ వెంట నందిగామ ఆర్‌డీవో కె.పోసిబాబు, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News