విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ IAS, నందిగామ మండలం కంచేల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంట పొలాలను పరిశీలించారు. కంచేల గ్రామంలోని రైతు సిచ్ వి.ఎన్. మహేంద్ర పొలంలో మామిడి తోటలో ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగించే జీవ ఉత్ప్రేరకాలు అయిన ద్రవ జీవామృతం, కీటకనాశిని, దశపర్ణి కషాయాల తయారీలో పాల్గొన్నారు. అలాగే ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS)లో పాల్గొని విత్తన గుళికల తయారీని పరిశీలించారు. విత్తనాలు గుళికలుగా చేసి భూమిలో వేయడం వల్ల 6 నెలల వరకు విత్తనాలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండి, కొద్దిపాటి వర్షపాతం పడిన వెంటనే మొలకెత్తుతాయని తెలుసుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్‌చార్జ్ వి. నాగ ప్రమీల రాణి, ఇతర ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, నందిగామ డివిజన్ ADA ఐకే శ్రీనివాస్ , అగ్రికల్చర్ అధికారులు, MRO, RDO, DDO మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News