– మూడు రోజుల పాటు కళా సాంస్కృతిక సంబరం
– ప్రతిఒక్కరూ భాగస్వాములై వారసత్వ సంపదకు వన్నె తేవాలి
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 18వ తేదీ శనివారం నుంచి మూడు రోజుల పాటు కొండపల్లి బొమ్మల పండగ అత్యంత వైభవంగా జరగనుందని.. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రపంచ వారసత్వం దినోత్సవం (World Heritage Day) సందర్భంగా జిల్లాలో మన ఘన సంస్కృతిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ఇందులో భాగంగా కొండపల్లి బొమ్మల పండగను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు ఉదయం ఆరు గంటలకు హెరిటేజ్ ట్రెక్కింగ్ ఫారెస్ట్ వాక్ ఉంటుందన్నారు. ఉదయం 10 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు. ఆపై వరుసగా చేతివృత్తుల మూలాలు, బొమ్మలు, 400 సం. చరిత్రపై చర్చ, లైవ్ లో బొమ్మలు చెక్కే ప్రదర్శన,
రంగోలి పోటీలు, గ్రామ వీధుల సుందరీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు – కవి సమ్మేళనం, కీలు బొమ్మలు, తోలుబొమ్మల ప్రదర్శన ఉంటుందని వివరించారు.
*రెండో రోజు ఆదివారం ఉదయం 10 గంటలకు బొమ్మల దర్బార్-బొమ్మల ప్రదర్శన & బొమ్మల కొలువు ఉంటుందని తెలిపారు. ఆపై కొండపల్లి బొమ్మల ఉత్పత్తి, కళాకారులకు తెల్లపొనిక చెట్టు వనరులను అందించడం-పాలసీ దృక్కోణంపై చర్చ, విమెన్ ఫ్రం బ్యాక్ రూమ్స్ టు బోర్డు రూమ్స్ పై చర్చ, కొండపల్లి కార్నివాల్, జానపద ప్రదర్శనలు, కళాకారుల ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మల ప్రదర్శన ఉంటాయని వివరించారు.
మూడో రోజు ఈ నెల 20న ఉదయం 11 గం.లకు మార్కెటింగ్, వ్యాపార అవకాశాలపై చర్చ ఉంటుందని తెలిపారు. ఆపై మధ్యాహ్నం 3.30 గంటలకు ఆటవిడుపుగా రోప్ పుల్లింగ్, మ్యూజికల్ చైర్స్, లెమన్ & స్పూన్, బొమ్మల ప్రేరణతో పిల్లల ఫ్యాషన్ షో & పవర్ విమెన్ ఆఫ్ కొండపల్లి, పిండివంటల ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని.. చివరగా విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమంతో పాటు ముగింపు వేడుక ఉంటుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. గౌరవ ప్రజాప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొంటారని.. ప్రతిఒక్కరూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News