Breaking News

చలివేంద్రం ప్రారంభం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన నగర కమిషనర్ కే. మయూర్ అశోక్. శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని పార్కింగ్ వద్ద చలివెంద్రాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సందర్శకులు, పన్ను చెల్లించడానికి వచ్చే ప్రజల దాహార్తి తీర్చేలా ప్రస్తుతం ఉన్న రెండు ఆర్.ఓ ప్లాంట్లకు అదనంగా చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ క్రింద గుంటూరు నగరంలో జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలలో మరియు నగరంలోని ప్రధాన కూడళ్ళలో చలివెంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాలలో 14 చలివెంద్రాలను ఏర్పాటు చేయుట జరిగిందని, ఇంకా 30 ప్రాంతాలలో చలివెంద్రాలను ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యస్.ఈ జి. వెంకటేశ్వర రావు, ఈ.ఈ లు, ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *