కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు 1వ వార్డులో శ్రీరామ కాలనీలో జ్వర బాధితులను కలవడం జరిగిందని, ఇవి వైరల్ జ్వరాలు గా ప్రాధమికంగా తెలిసిందని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జేసి శ్రీరామ్ కాలనీ లో పర్యటించి ,అనంతరం ప్రభుత్వానికి ఆసుపత్రిలో అధికారు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, శ్రీరామ్ కాలనీలో కొందరు జ్వరాల తో, తీవ్ర కాళ్ళ నొప్పుల ( జాయిం ట్ పేయిన్స్ ) సమస్య తో బాధప డుతున్నట్లు తెలియడంతో కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారితో కలిసి రావడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుప త్రిలో నే మెరుగైన వైద్య సేవలు అం దించేందుకు చర్యలు చేపడుతు న్నామన్నారు. ఎటువంటి భయాం దోళనకు గురికావద్దని తెలిపారు. ఇప్పటికే వైద్యాధికారులతో ప్రాధ మిక దర్యాప్తు చెయ్యడం జరిగింద న్నారు. బాధితులకు చెందిన రక్త నమూనాలు ల్యాబరేటరీ ల్లో ప రీక్షలు నిర్వహించి, నివేదికలు ప రిశీలించడం పై చర్యలు చేపట్టామ న్నారు. విశాఖపట్నం నుంచి రేప టికి నివేదికలు వస్తాయన్నారు. బా ధితులతో మాట్లాడడం జరిగిందని, ఇప్పటికే మంత్రి తానేటి వనిత, కొవ్వూరు మునిసిపల్ చైర్ పర్సన్ ఈ ప్రాంతంలో పర్యటించా రన్నారు. ఇప్పటి వరకు 16 కేసులు నమోదు అయ్యాయని, ఈ రోజు సాయంత్రం తర్వాత ఎటువంటి కేసులు నమోదు కాలేదన్నారు. ప్రతి వీధిలో ఒక ఏఎన్ఎమ్ లు, ఇద్దురు ఆశా కార్యకర్త లని ప్రత్యేక ముగా నియమించడమే కాకుండా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరిస్థితి ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని శుక్లా తెలిపారు. జ్వరాలకీ సంబంధించిన వైద్య సేవలు ప్రారంభించామని, ప్రస్తుతం జ్వరం అదుపులో ఉండి, తగ్గుముఖం పట్టాయన్నారు. డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో కొవ్వూ రు సి హెచ్ సి లో జనరల్ ఎక్సపెర్ట్ ఫిజిషియన్, పిల్లలు డాక్టర్ల ను తాత్కాలికంగా నియమించా మన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసు ల్లో 8 స్వల్ప లక్షణాలు ఉన్నాయని, మిగిలిన 8 కేసుల్లో తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు ఉన్నాయని, వైద్య సేవలు ప్రారంభించామని, వారికి కూడా త గ్గుముఖం పట్టాయన్నారు. ఇవి డెం గ్యూ, మలేరియా కాదని , వైరల్ జ్వరాలుగా ప్రాథమికంగా అంచనా కి రావడం జరిగిందన్నారు. ఈప్రాంతంలోని ఇళ్ల నుంచి నీటి, పాలు, కూరగాయల , ఆహార పదార్థాల సాంపుల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
డీఎంహెచ్ఓ డా. బి. రవి, డి. సి. హెచ్. ఎస్. ఏ. వి. ఆర్. మోహన్, మునిసిపల్ ఛైర్పర్శన్, బావన రత్నకుమారి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఎం. శ్రీనివాస్,డిప్యుటీ డీఎంహెచ్ఓ, పి. రామగురు రెడ్డి,
ప్రభుత్వ వైద్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నా రు.