-సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బందర్ రోడ్డు రాఘవయ్య పార్క్, రాజీవ్ గాంధీ పార్క్ లను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ బుధవారం అధికారులతో కలసి పార్క్ లలో జరుగుతున్న ఆధునీకరణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంలో చేపట్టిన పనులలో పురోగతిని అధికారులను అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, ఇంజనీరింగ్ మరియు గ్రీనరీ పనులు అన్నియు వేగవంతం చేసి సత్వరమే పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. రాజీవ్ గాంధి పార్క్ లో జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేస్తూ, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి నవంబర్ నాటికీ పార్క్ సందర్శకులకు అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి ఎర్రకట్ట డౌన్ కేదారేశ్వరపేట వద్ద జరుగుతున్న పార్క్ మరియు వాకింగ్ ట్రాక్, గ్రీనరి అభివృద్ధి పనులను పరిశీలించి చేపట్టిన అన్ని పనులు సత్వరమే పూర్తి చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్, ఎస్.ఇ (ప్రాజెక్ట్స్) పి.వి.వి.భాస్కర్ రావు, ఎ.డి.హెచ్. జె. జ్యోతి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.