బాణసంచా విక్రయ స్టాల్స్ ఏర్పాటు చేసుకొనుటకు విక్రయదారుల నుండి దరఖాస్తులు ఆహ్వానం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ది.­­­­­30-10-2021 నుండి ది.04-11-2021 వరకు (5 రోజులు) దీపావళి పండుగ సందర్భముగా స్వరాజ్యమైదానం (PWD Grounds), మాకినేని బసవపున్నయ్య మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, సింగ్ నగర్ మరియు పున్నమి ఘాట్, భవానీపురం నందు బాణసంచా విక్రయ స్టాల్స్ ఏర్పాటు చేసుకొనుటకు విక్రయదారుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

బాణసంచా విక్రయ స్టాల్స్ ఏర్పాటు చేసుకొనుటకు దరఖాస్తులు పొందుటకు మరియు దాఖలు చేసుకొనుటకు గడువు ది.28-10-2021 మరియు 29-10-2021 తేదిలలో మధ్యాహ్నం 2.00 గం.ల అవకాశం ఉందని తెలియజేస్తూ, దరఖాస్తు రుసుము వివరములు ఈ క్రింది పట్టికలో పేర్కొనడమైనది.

వ.నెం    ప్రదేశము పేరు                          దరఖాస్తు రుసుము + GST 18%

1. స్వరాజ్యమైదానం (PWD Grounds), రూ.35,000 + రూ.6,300 = రూ.41,300

2. మాకినేని బసవపున్నయ్య మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, సింగ్ నగర్రూ, .25,000 + రూ.4,500 = రూ.29,500

3. పున్నమి ఘాట్, భవానీపురం, రూ.25,000 + రూ.4,500 = రూ.29,500

పూర్తి చేసిన దరఖాస్తులు నగరపాలక సంస్థ సర్కిల్-2 కార్యాలయము (సత్యనారాయణపురం, AKTPMCH School ప్రక్కన) నందలి ఎస్టేట్ విభాగపు కార్యాలయము నందు ది.28-10-2021 ఉదయం 11.00 గం.ల నుండి సాయంత్రము 4.00 గం.ల వరకు మరియు 29-10-2021 ఉదయం 11.00 గం.ల నుండి మధ్యాహ్నం 2.00 గం.ల వరకు స్వీకరించబడును. మరియు ది.29-10-2021న మధ్యాహ్నం 3.00 గం.లకు దరఖాస్తుదారుల సమక్షములో లాటరీ పద్ధతి ద్వారా స్టాల్స్ కేటాయించబడునని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *