రూ.19 లక్షల అంచనాలతో సి.సి. రోడ్ నిర్మాణ పనులను శ్రీకారం…

-53 డివిజన్ నందు పనులు ప్రారంభిoచిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం 53 వ డివిజన్ లోని పోతిన పాపయ్య విధిలో సుమారు రూ.19 లక్షల అంచనాలతో నిర్మించనున్న సి.సి. రోడ్ నిర్మాణ పనులను బుధవారం నగర రాయన భాగ్యలక్ష్మీ, డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీతో కలసి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని అన్ని సమస్యలపై మన మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను సత్వరమే పరిష్కారించేలా చర్యలు తీసుకునట్లు వివరించారు. విజయవాడ నగరంలోని రోడ్లు, త్రాగునీరు, డ్రెయినేజి మొదలగు అన్ని అభివృద్ధి పరచుట జరుగుతుందని పేర్కొన్నారు.  కార్యక్రమములో డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ గారు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొనకళ్ళ విద్యాధర రావు ,కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు….

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *