Breaking News

అవగాహన వాక్ థన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ Occupational Therapy Day ” సందర్భంగా ఎనికపాడు హ్యాపీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహ్యబిలీటేషన్ సెంటర్ వారి అద్వర్యంలో బి.ఆర్.టి.ఎస్ రోడ్ నందు ఏర్పాటు చేసిన అవగాహన వాక్ థన్ నందు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ ముఖ్య అతిధిగా పాల్గొని Dr.S.రామ్ ప్రసాద్ (MBBS, MD.pediatrica) గారితో కలసి Walkathan ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్యుపేషనల్ థెరపీ యొక్క ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం మరియు వారి శారీరక, మానసిక, అభిజ్ఞా సవాళ్లను అధిగమించడంలో పిల్లల లేదా పెద్దల సామర్థ్యానికి అనుగుణంగా వారి జీవితాలను స్వతంత్రంగా చేయడంలో శిశువులను పెద్దలకు మెరుగుపరచడంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ వాక్ థన్ బి.ఆర్.టి.ఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ నుండి పడవల రేవు వరకు చిన్నారులతో కలసి నడిచారు. కార్యక్రమములో టి.గాయత్రీ దేవి, పలువురు చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *