గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అన్ని శాఖలు పనిచేయాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. రహదారులు, గృహ నిర్మాణం వంటి పనుల ప్రజలకు ఎంతో అవసరమని వాటి పట్ల దృష్టి సారించి త్వరితగతిన పూర్తి అయ్యేటట్లుగా అధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశించారు. జిల్లాలో మంజూరైన రహదారులు వాటి పరిస్థితుల వివరాలను పరిశీలించి తక్షణం పనులు పూర్తి చేయుటకు అవకాశం ఉన్న వాటిని అతివేగంగా పూర్తి చేయాలని అన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని, వారికి అవగాహన కల్పించి త్వరగా నిర్మాణాలు పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు అవసరమగు సాంకేతిక లాజిస్టికల్ సహకారాన్ని అందించాలని చెప్పారు. స్టేజ్ 3 డివియేషన్ ఉన్న కాంట్రాక్టర్ల తో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఆయా పనులను పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో రహదారులు భవనాల శాఖ అధికారులు, జల వనరుల శాఖ అధికారులు, విద్యుత్తు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News