Breaking News

ఈ-కేవైసీ వేగవంతం చేసి పాస్ పుస్తకాల జారీకి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రీస‌ర్వే పూర్త‌యిన రెండు గ్రామాల్లో పట్టాదార్ పాసుపుస్తకాల జారీకి సంబంధించి ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి సి.సి.ఎల్.ఏ గురువారం జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేసి, ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి,  జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, సర్వే శాఖ ఉప సంచాలకులుతోయజాక్షజ రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *