Breaking News

ఈ నెల 27న పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీక‌ర‌ణ‌

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 27వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీక‌రించనున్న‌ట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపడుతునున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అదేవిధంగా డివిజ‌న‌ల్‌, మండ‌ల‌స్థాయిలో రెవెన్యూ క్లినిక్ లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌జ‌లు త‌మ రెవెన్యూ అర్జీల‌ను ఈ క్లినిక్‌ల‌లో అంద‌జేయాల‌ని సూచించారు.
అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ నందు కూడా నమోదు చేసుకోవచ్చని .. నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100 కి నేరుగా కాల్ చేయవచ్చని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *