Breaking News

మెప్మా ఆధ్వర్యంలో ఎగ్ కార్ట్ యూనిట్ ప్రారంభం

-‘ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త’ విజన్‌తో మహిళలకు స్వావలంబన
– మెప్మా పిడి టి. కనక రాజు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం క్వారీ మార్కెట్ సెంటర్, రాజమహేంద్రవరంలో మెప్మా ఆధ్వర్యంలో ఎగ్ కార్ట్ యూనిట్‌ను ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు చిన్న స్థాయి వ్యాపారాలను ప్రారంభించి, ప్రభావవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన “ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త (OFOE)” విజన్‌లో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందజేసిన సుమారు నాలుగు లక్షల రూపాయల విలువ గల ఎగ్ కార్ట్ యూనిట్‌ను ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మెప్మా మిషన్ డైరెక్టర్ నిర్దేశించిన లక్ష్యాల మేరకు జిల్లాలో స్పెషల్ ప్రాజెక్టుల కింద అరకు కాఫీ, చాయ్ రాస్తా, ఫిష్ బైట్ వంటి యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు (MOU) చేసుకున్నామని చెప్పారు. సంబంధిత సంస్థలతో మహిళా సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహించి, దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.

మెప్మా ద్వారా యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే మహిళలు నగర పాలక సంస్థలోని మెప్మా విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. “ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త” విజన్‌ను సమర్థవంతంగా అమలు చేసి లక్ష్యాలను పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొమ్ముల దత్తు, మాజీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, జిల్లా సిబ్బంది శ్రీమతి పి. శ్రీదేవి, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ శ్రీమతి వి. రామలక్ష్మి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *