Breaking News

రీ సర్వే పనులు వేగవంతం చేయాలి

-“మీ భూమి–మీ హక్కు” గ్రామసభలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ
-364 మందికి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
చాగల్లు మండలం పరిధిలో బుధవారం జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ క్షేత్ర స్థాయిలో పర్యటించి 5 వ విడత రీ సర్వే పనులను పరిశీలించారు. అనంతరం బ్రాహ్మణ గూడెం గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

మండలంలోని చాగల్లు గ్రామంలో నిర్వహిస్తున్న ఐదో విడత రీ సర్వే పనులను ఏడీ సర్వే మరియు ఇతర అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, నిర్ణీత సమయంలో సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను క్షేత్ర స్థాయిలోనే వేగంగా పరిష్కరించేలా అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ, భూ సర్వే వాటికి సంబంధించినవి ఎక్కువగా వస్తున్నాయని తెలియ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పౌర సేవలు అందించాలని ఆదేశించారు.

అనంతరం చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 364 మందికి పాసు పుస్తకాలను అందజేశారు. భూమి హక్కుల పరిరక్షణకు ఈ పాసు పుస్తకాలు కీలకమని పేర్కొంటూ రైతులు వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. “మీ భూమి–మీ హక్కు” గ్రామసభలో భూమి హక్కుల పరిరక్షణ, రీ సర్వే ప్రక్రియ, పట్టాదారు పాసు పుస్తకాల ప్రాముఖ్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె. ఆనందరావు, జిల్లా సర్వే అధికారి బి. లక్ష్మీ నారాయణ, తహసిల్దార్ ఎం. మెరికమ్మ, ఇతర శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *